ప్రజాసేవకు అంకితం కావాలి: ఈటల గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు కృషిచేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని బిర్లా ఆడిటోరియంలో నిర్వహించిన సగర సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ ప్రథమ పౌరుడి హోదాలో ప్రజా సేవకు అంకితం కావాలని ఈటల కోరారు. గ్రామ సమస్యలపై దృష్టి సారించి ప్రజల మెప్పు పొందాలన్నారు. సగరుల కుల దైవం భగీరథ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.