తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈఎస్​ఐ కుంభకోణంలో నిందితురాలిపై ఈడీ కేసు

ఈఎస్ఐ బీమా వైద్య సేవల కుంభకోణంలో ప్రధాన సుత్రధారి దేవికారాణితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర అధికారులపై ఈడీ కేసు నమోదైంది.

devikarani
ఈఎస్​ఐ కుంభకోణంలో నిందితురాలిపై ఈడీ కేసు

By

Published : Dec 28, 2019, 12:47 PM IST

ఈఎస్ఐ బీమా వైద్య సేవల కుంభకోణంలో ప్రధాన సుత్రధారి దేవికారాణిపై ఈడీ కేసు కూడా నమోదైంది. ఆమెతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర అధికారులపైనా ఈడీ కేసు నమోదు చేసింది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా డబ్బులను పక్కదారి పట్టించినట్లు తేలడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దేవికారాణిని కస్టడీలోకి తీసుకొని ఆ శాఖ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

బీమా వైద్య సేవల విభాగంలో నకిలీ బిల్లులు సృష్టించి వందల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు అవినీతి నిరోధక శాఖ తేల్చింది. ఇప్పటికే ఈ కేసులో ఐఎంఎస్ సంచాలకులు దేవికా రాణి, సంయుక్త సంచాలకులు పద్మ, సహాయ సంచాలకులు ఇందిరతో పాటు కార్యాలయ సిబ్బంది, ఔషధ పరిశ్రమలకు చెందిన యజమానులను అనిశా అరెస్ట్ చేసింది. అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేయడం... బహిరంగ మార్కెట్​లో లభించే ధర కంటే ఎక్కువ చెల్లింపులు చేయడం వల్ల భారీ అవినీతి చోటు చేసుకుంది. నిబంధనలు పాటించకుండా మందులు కొనుగోలు చేసినట్లు అనిశా తేల్చింది.

దేవికారాణి భర్త గురుమూర్తిపైనా అనిశా అధికారులు ఆదాయానికి మించిన కేసులు నమోదు చేశారు. వంద కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఔషధాల కుంభకోణంలో ప్రతి అంశాన్ని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు అనిశా అధికారులు నమోదు చేసిన కేసుల వివరాలన్నీ కూడా ఈడీకి సమర్పించారు. ఎన్​ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

ఇవీ చూడండి: ఆ విద్యార్థినులు గర్భం దాల్చడానికి ఎవరు కారణం?

ABOUT THE AUTHOR

...view details