ETV Bharat / state

ఆ విద్యార్థినులు గర్భం దాల్చడానికి ఎవరు కారణం? - students get pregnancy

గిరిజన వాసులైనా తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు. వారిని చదివించి ఉన్నత స్థాయిలో చూడలనుకున్నారు. కానీ వారి ఆశలను ఎవరో కల్లోలం చేశారు. ఎవరు చేశారు... ఎందుకు చేశారు... ఎప్పుడు చేశారో తెలియదు కానీ... డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు గర్భం దాల్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది.

degree students get pregnancy at girijana degree college at kumarambheem
ఆ విద్యార్థినులు గర్భం దాల్చడానికి ఎవరు కారణం?
author img

By

Published : Dec 28, 2019, 10:57 AM IST

Updated : Dec 28, 2019, 12:23 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిగ్రీ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు తరచూ అస్వస్థతకు గురయ్యేవారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరిని కళాశాలలో పనిచేస్తున్న నర్సు... ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించింది. ముగ్గురికి వైద్య పరీక్షలు చేయగా వీరిలో ఇద్దరు గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధరించారు. ఒకరు రెండు నెలల క్రితమే గర్భం దాల్చినట్లు వైద్యులు తేల్చారు.

ఈ విషయాన్ని ముందే గుర్తించిన స్థానిక వైద్య సిబ్బంది... కళాశాల ప్రిన్సిపల్​కు, తల్లిదండ్రులకు తెలుపకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఏఎన్​ఎమ్​, ప్రిన్సిపల్‌, జిల్లా గిరిజన అధికారుల సమక్షంలో విద్యార్థుల నుంచి పూర్తిస్థాయి వివరాలు సేకరించనున్నారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఆ విద్యార్థినులు గర్భం దాల్చడానికి ఎవరు కారణం?

ఇవీ చూడండి: దశాబ్ది సవాల్​: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం

Intro:గిరి కుసుమ లపై కాటు.....

ఎవరిదీ పాపం...... ఎవరికీ పాపం.....

అధికారుల పర్యవేక్షణ లోపమా.....

ఐటీడీఏ అధికారులు ఉట్నూర్ కే పరిమితమా.......

ఇద్దరు విద్యార్థులు గర్భం దాల్చినట్లు గా చెబుతున్న వైద్య నివేదికలు......

అఘాయిత్యానికి పాల్పడింది ఎవరు....

నేడు ఆర్ సి వో విచారణ....

మారుమూల గ్రామాల నుంచి చదువుకుందామని వచ్చిన గిరి విద్యార్థులు వారు వసతితో పాటు విద్య లభిస్తుందని మెరుగైన విద్య కు బాటలు వేసుకుందామని తలచారు.

ఏ పాపము కన్ను పడింది ఎవరు అఘాయిత్యానికి పాల్పడ్డారో కానీ మోయలేని భారం తో విద్యార్థినులు కుంగిపోతున్నారు. వైద్యపరీక్షల్లో గర్భందాల్చిన విషయం స్పష్టం కావడంతో విచారణకు అధికారులు సిద్ధమవుతున్నారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని గిరిజన డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అనారోగ్య సమస్యలతో తరచూ బాధ పడేవారు. ఈ క్రమంలో డిసెంబర్లో విద్యార్థినులను కళాశాలలో పనిచేసే నర్సు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి వైద్య పరీక్షలు చేయగా ఇద్దరు విద్యార్థులు గర్భం దాల్చినట్లుగా వైద్యులు గుర్తించారు. ఇందులో ఒకరు రెండు నెలల క్రితమే గర్భం దాల్చినట్లు గా వైద్యులు తేల్చారు.

ఎన్నో అనుమానాలు.....

రెండు నెలల కిందటే గర్భందాల్చిన విద్యార్థిని వసతి గృహంలో గుర్తించిన స్థానిక వైద్య సిబ్బంది. ప్రిన్సిపాల్ ఈ విషయం ఇంతకాలం ఎందుకు గుట్టుగా ఉంచారని అనుమానాలు రేకెత్తుతున్నాయి. తల్లిదండ్రులకు తెలపడమో, ఉన్నతాధికారులకు వివరించడమో చేయకుండా తాత్సారం చేయడం లో ఆంతర్యం అంతు పట్టడం లేదని గిరిజన సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
ఆడబిడ్డలు చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని పంపితే ప్రభుత్వ వసతి గృహాల్లో సైతం రక్షణ లేకపోతే ఎలా అని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

నేడు ఆర్ సి వో విచారణ.....

కళాశాల విద్యార్థులు గర్భం దాల్చినట్లు గా వచ్చిన వ్యవహారంలో నేడు ఆర్ సి ఓ లక్ష్మయ్య విచారణ చేయనున్నారు. విద్యార్థులతోపాటు ఏఎన్ఎం, ప్రిన్సిపాలు, జిల్లా గిరిజన అధికారుల సమక్షంలో విద్యార్థుల నుంచి పూర్తి స్థాయి వివరాలు సేకరించనున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు.

సమత సంఘటన అనంతరం జిల్లాలోని తిర్యాని మండలం పంగిడి మాదర లోమహిళ అదృశ్యమైంది ఈమె ఆచూకి కోసం వారం నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్న లభించలేదు, ఆ వెంటనే కళాశాలలో విద్యార్థుల ఘటన జరిగింది. అయినప్పటికీ ఐటీడీఏ అధికారుల అలసత్వం కొట్టినట్టుగా కనబడుతూనే ఉంది కనబడుతోంది. గత నెల 24న సమత కేసు మరవకముందే గత సోమవారం కంటే ముందు తిర్యాని మండలం లో కేసు మరవకముందే మరో ఘటన వెలుగులోకి రావడంతో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు భయాందోళనకు గురి అవుతూ ఉన్నారు. విద్యార్థినులు కు తెలిసి తెలిసి తెలియని చేసిన పాపం ఎవరిది ఈ పాపం ఎవరిది ఈ పాపం అంటూ గిరి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు కనులు తెరిచి విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి .ఈ పాపం ఎవరిది అన్న విషయం లో చర్చనీయాంశంగా మారింది.

తల్లి చాటు బిడ్డగా చదువుకోవాలన్న ఆశ తో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశ ఆదిలోనే అవకాశాలు ఉన్నప్పటికీ అధికారులు నిద్రపోతున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా

Body:tg_adb_25_28_giri_kusumalapai_kaatu_avb_ts10078

Conclusion:
Last Updated : Dec 28, 2019, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.