కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే సందర్శకులకు అనుమతి ఇచ్చే దుర్గం చెరువు తీగల వంతెనపై ప్రజలు యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఫోటోలు దిగేందుకు సాహసాలు చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబం ఫోటో దిగేందుకు ప్రయత్నించి, సీసీకెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది.
దుర్గం చెరువు తీగల వంతెనపై దంపతుల పాట్లు - హైదరాబాద్ తాజా సమాచారం
హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన దుర్గం చెరువు తీగల వంతెనపై నిబంధనల ఉల్లంఘన కొనసాగుతోంది. పోలీసులు ఆంక్షలు విధించినా సందర్శకులు ఫోటోలు దిగేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ కుటుంబం ఫోటో దిగేందుకు ప్రయత్నించి సీసీ కెమెరాలకు దొరికిపోయింది.
దుర్గం చెరువు తీగల వంతెనపై దంపతుల పాట్లు
ట్రాఫిక్ పోలీసుల చలానా నుంచి తప్పించుకునేందుకు ద్విచక్రవాహనం నంబర్ ప్లేట్‌కు చున్నీని అడ్డుగా పెట్టి, ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఇదంతా కెమెరాల్లో పరిశీలిస్తున్న పోలీసులు సైరన్ మోగించడంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. వంతెనపై వాహనాలు నిలపడం ప్రమాదమని ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రజలు ఏమాత్రం లెక్కచేయడం లేదు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 24 గంటలు సీసీటీవీ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు.