జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగానే కేటీఆర్ తనకు తానే ముఖ్యమంత్రిగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆక్షేపించారు. కేంద్రం ఏమి ఇచ్చిందంటున్న కేటీఆర్... హైదరాబాద్‌కు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మేమిచ్చామంటున్నా కేసీఆర్, కేటీఆర్‌లు.. వారి ఇళ్ల నుంచి ఇచ్చారా అని ప్రశ్నించారు. చింతమడకకు కేసీఆర్ లక్షా 50 వేలు ఇస్తే కేంద్రం 8 లక్షలు ఇచ్చిందని రఘునందన్‌రావు తెలిపారు.
'గ్రేటర్ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దు'
కేంద్రం ఏమి ఇచ్చిందంటున్న మంత్రి కేటీఆర్... హైదరాబాద్‌కు ఏం చేశారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దని ఆయన అన్నారు.
'గ్రేటర్ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దు'
దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు తండ్రి, కొడుకులకు లేదన్నారు. సెక్యూలర్ అనే పదానికి కేటీఆర్‌కు అర్థం తెలుసా అని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస యాక్షన్ బట్టే... భాజపా రియాక్షన్ ఉంటుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను హిందూ, ముస్లింల మధ్య పోటీగా చిత్రీకరించవద్దని తెలిపారు.
ఇవీ చూడండి: టికెట్ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన