జూబ్లీహిల్స్‌లోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 4 కార్లు, 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల యజమానులకు తాఖీదులు జారీ చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
తాగారు.. దొరికారు...
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతుంది. మందుబాబులు మాత్రం తమకేం పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు