రామమందిర భూమిపూజకు ఐదు వెండి ఇటుకలు పంపినట్లు హనుమాన్ ఉపాసకులు కంచర్ల వెంకటరమణ వెల్లడించారు. అయోధ్యలోని శ్రీరామమందిర నిర్మాణానికి 150 వెండి ఇటుకలను పంపించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈనెల పదో తేదీలోగా మరో ఐదు ఇటుకలు పంపనున్నట్లు తెలిపారు.
రామమందిర నిర్మాణానికి వెండి ఇటుకల ప్రదానం - రామమందిర నిర్మాణానికి వెండి ఇటుకల పంపిణీ
అయోధ్యలోని శ్రీరామమందిర నిర్మాణానికి 150 వెండి ఇటుకలను పంపించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు హనుమాన్ ఉపాసకులు కంచర్ల వెంకటరమణ తెలిపారు. ఇందులో భాగంగా పంపుతున్న వెండి ఇటుకను రామ్గోపాల్ పేట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం భక్తులు దర్శించుకున్నారు.
అయోధ్యకు వెండి ఇటుకలు
ఇందులో భాగంగా రామమందిర నిర్మాణానికి ఉపయోగించబోయే వెండి ఇటుకను రామ్గోపాల్ పేట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా ఎన్నికల్లో గెలిచిన రామ్గోపాల్ పేట డివిజన్ అభ్యర్థి వీర సుచిత్ర, భాజపా నాయకుడు బావర్లాల్ వర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.