తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి లభ్యత ఆధారంగా పంపకాలు: కృష్ణా బోర్డు - andrapradesh

కృష్ణానదిలో నీటి లభ్యత ఆధారంగా ఇరు రాష్ట్రాలకు పంకాలు ఉంటాయని కృష్ణా బోర్డు ఛైర్మన్​ ఆర్​ కె. గుప్తా అన్నారు. పాత పద్ధతిలోనే నీటి విడుదల ఉంటుందని స్పష్టం చేశారు.

కృష్ణా బోర్డు

By

Published : Aug 9, 2019, 5:03 PM IST

కృష్ణా నీటి పంపకాలు పాత పద్ధతిలోనే 66:34 శాతంలో ఉంటాయని కృష్ణా బోర్డు ఛైర్మన్​ ఆర్​ కె. గుప్తా తెలిపారు. ఇరు రాష్ట్రా ప్రభుత్వాలు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణయించాయన్నారు. టెలిమెట్రీల బిగింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని కొన్ని నెలల్లో పూర్తి కావొచ్చని చెప్పారు. తెలంగాణ 103 టీఎంసీలు... ఏపీ 38 టీఎంసీలు కావాలని ఇండెంట్ ఇచ్చాయని తెలిపారు. త్రిసభ్య కమిటీ భేటీలో నీటి కేటాయింపు ఉంటుందని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్​ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం ఏపీలో ఉండాలన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్​లో ఉండాలని కోరిందని వివరించారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టి తీసుకెళ్తామని గుప్తా తెలిపారు.

నీటి లభ్యత ఆధారంగా పంపకాలు: కృష్ణా బోర్డు

ABOUT THE AUTHOR

...view details