వరంగల్లో 9 నెలల చిన్నారి అత్యాచారంకేసులో న్యాయస్థానం తీర్పుపట్ల డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేసిన వరంగల్ పోలీసుల పనితీరును మెచ్చుకున్నారు. 48 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి, తగిన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానానికి సమర్పించడంలో వరంగల్ పోలీసులు సఫలీకృతం అయ్యారని ప్రశంసించారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా పోలీసులు కృషి చేశారని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.
శిక్ష పడేలా చేసిన "పోలీసులు శభాష్": డీజీపీ ట్వీట్ - అత్యాచారం
తొమ్మిది నెలల చిన్నారి అత్యాచారం కేసులో న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. 48 రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేశారని పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.
శిక్ష పడేలా చేసిన "పోలీసులు శభాష్": డీజీపీ ట్వీట్