తెలంగాణ

telangana

ETV Bharat / state

lockdown: రాష్ట్రంలో పటిష్ఠంగా లాక్‌డౌన్: డీజీపీ - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోసారి పొడగించిందని తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.

lockdown, dgp mahender reddy
లాక్‌డౌన్, డీజీపీ మహేందర్ రెడ్డి

By

Published : Jun 1, 2021, 9:39 AM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రజలందరూ తమ పనులను ముగించుకుని ఇళ్లకు వెళ్లాలని సూచించారు. తార్నాక చెక్‌పోస్ట్ వద్ద సోమవారం తనిఖీలు చేపట్టారు.

గూడ్స్ వాహనాలకు కేవలం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 11 వరకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. రాష్ట సరిహద్దుల్లో పటిష్ఠ చర్యలు చేపట్టామని వెల్లడించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించిందని అన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:ఊబకాయులా? గుండె జబ్బు ముప్పు తగ్గించుకోండి ఇలా!

ABOUT THE AUTHOR

...view details