సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ అందింది. కార్మికులు, ఉద్యోగుల ఖాతాల్లో బోనస్ సొమ్మును సింగరేణి సంస్థ ఇవాళ జమ చేసింది. దీపావళి బోనస్‌గా పిలిచే పెర్ఫార్మెన్స్ లింక్డు రివార్డు (పీఎల్ఆర్) పథకం కింద ఒక్కొక్కరికి సుమారు రూ.64,700 బోనస్ ఇచ్చింది. కార్మికులు, ఉద్యోగులందరికీ కలిపి రూ.258 కోట్లను విడుదల చేసింది. ఇటీవలే రూ.494 కోట్ల రూపాయలను లాభాల్లో వాటాగా బోనస్ ఇచ్చింది. రెండూ కలిపి ఒక్కో కార్మికుడికి సుమారు లక్ష రూపాయల బోనస్ ఇచ్చినట్లు సింగరేణి సంస్థ పేర్కొంది. కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సింగరేణి సీఎండీ... బోనస్ సొమ్ములో కొంతైనా పొదుపు చేసుకోవాలని సూచించారు.
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
సిరుల వేణి సింగరేణి.. కార్మికులు, ఉద్యోగులకు దీపావళి బోనస్ చెల్లించింది. పీఎల్ఆర్ పేరిట ఒక్కో కార్మికుడికి సుమారు రూ.64,700 వరకు ఖాతాలో జమ చేసింది.
ఒక్కో కార్మికుడికి సుమారు రూ.64,700 బోనస్ అందించిన యాజమాన్యం