Dasoju Sravan Petition on Governor Decision : ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాసోజు శ్రవణ్(Dasoju Sravan), కుర్రా సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా గత జులైలో మంత్రిమండలి తీర్మానం చేసింది.
హ్యాపీ న్యూ ఇయర్ తెలంగాణ - గవర్నర్, సీఎం శుభాకాంక్షలు
మంత్రిమండలి నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించింది. మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని దాసోజ్ శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సీజే ధర్మాసనంలో శుక్రవారం వాదనలు జరగనున్నాయి.
Governer Tamilisai Rejects Nominated MLCs :గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీఆర్‌ఎస్ మంత్రి మండలి సిఫారసు చేసిన నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గతంలో తిరస్కరించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల అభ్యర్థిత్వాలను ఆమోదించాల్సిందిగా కోరగా ఆ సిఫారసులను తమిళిసై(Tamilisai) రిజెక్ట్ చేశారు. సర్వీస్ సెక్టార్‌లో వీరు ఎలాంటి సేవలు చేయలేదని, ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని స్పష్టం చేశారు.
ఆ వార్తలన్నీ అవాస్తవం - రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన గవర్నర్ తమిళిసై
సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవలో ఈ ఇద్దరికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని ఆర్టికల్ 171(5) అర్హతలు సరిపోవని తమిళిసై పేర్కొన్నారు. నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన ఎమ్మెల్సీలకు తగిన అర్హతలు లేవని తెలిపారు. అర్హతలు లేకుండా నామినేట్ చేయడం తగదన్న గవర్నర్ అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారన్నారు. అర్హులను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం తగదని హితవు పలికారు.
ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజాప్రాతినిథ్య చట్టంలో స్పష్టంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అనర్హత కిందకు రారని చెప్పేలా ఇంటెలిజెన్స్ సహా ఏ ఇతర సంస్థల నివేదికలు లేవని తెలిపారు. మంత్రివర్గ సిఫారసుతో అన్ని అంశాలను జత చేయలేదన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి పేర్లను ఆమోదిస్తే ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించబోదన్నారు. సరైన వ్యక్తులకు అవకాశాలను నిరాకరించినట్లవుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని అప్పటి మంత్రి మండలి,కేసీఆర్‌కు గవర్నర్ సూచించారు.
నిర్బంధ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు - మా పాలన దేశానికే ఆదర్శం కాబోతుంది : గవర్నర్ తమిళిసై