కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌తోపాటు నెలకు 2 నుంచి 5 వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని దళిత శక్తి ప్రోగ్రాం డిమాండ్ చేసింది. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారందరికి వెంటనే ఉపాధి కల్పించాలని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కన్వీనర్ రాజ్‌కమల్ మహరాజ్ కోరారు.
కరోనాతో అనాథలైన పిల్లలకు పెన్షన్ ఇవ్వాలి..
కరోనా వల్ల అనాథలైన పిల్లలకు ఫిక్స్‌డ్ డిపాజిట్‌తోపాటు నెలకు 2 నుంచి 5 వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని దళిత శక్తి ప్రోగ్రాం డిమాండ్ చేసింది. కరోనాతో మృతి చెందిన కుటుంబానికి రూ.10నుంచి 25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరింది.
కరోనాతో అనాథలైన పిల్లలకు పెన్షన్ ఇవ్వాలి..
ఈ మేరకు హైదరాాబాద్ యాకుత్‌పురా నియోజకవర్గం పరిధిలోని సైదాబాద్ మండల తహసీల్దార్‌కు 10 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కరోనాతో బాధపడుతున్న పేదకుటుంబాలకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని తెలిపారు. కరోనాతో మృతి చెందిన కుటుంబానికి రూ. 10నుంచి 25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.
ఇదీ చూడండి.. KCR: కొత్త మండలాలకు సీఎం పచ్చజెండా
Last Updated : Jun 10, 2021, 8:11 PM IST