అమాయకులకు మాయమాటలు చెప్పి నగదు దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఏకంగా ఓ శిక్షణా ఐపీఎస్ మెయిల్‌నే హ్యాక్ చేశారు. అనంతరం మెయిల్ నుంచి అతని స్నేహితులకు అత్యవసరంగా రూ.10వేలు డబ్బులు కావాలంటూ సందేశం పంపారు. స్నేహితులు 50వేల నగదును ఖాతాలో జమ చేశారు. వీరిలో ఓ స్నేహితుడు సదరు శిక్షణా ఐపీఎస్‌కు ఫోన్ చేసి... నగదు ముట్టిందా అని అడగ్గా అసలు విషయం బయటపడింది. తన మెయిల్ హ్యాక్ అయినట్లు గుర్తించిన శిక్షణా ఐపీఎస్.. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్... ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
శిక్షణా ఐపీఎస్ మెయిల్‌నే హ్యాక్ చేసిన కేటుగాళ్లు
శిక్షణా ఐపీఎస్ మెయిల్‌నే హ్యాక్ చేశారు. అత్యవసరంగా పది వేల రూపాయలు కావాలంటూ అతని మెయిల్ నుంచి స్నేహితులకు సందేశాలు పంపి గట్టుచప్పుడు కాకుండా 50 వేల రూపాయాలు దోచేశారు. ఓ స్నేహితుడు డబ్బులు ముట్టాయా..? అని ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది.
శిక్షణా ఐపీఎస్ మెయిల్‌నే హాక్ చేసిన కేటుగాళ్లు
Last Updated : Sep 6, 2019, 2:30 PM IST