ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవడం సాధ్యం కాదని ఆసంస్థ ఎండీ సునీల్ శర్మ వ్యాఖ్యానించడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమ్మె విఫలం అవ్వడానికి సీపీఎం పార్టీయే కారణమని మందకృష్ణ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. దీనిని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని తమ్మినేని తెలిపారు.
'ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు కలెక్టరేట్ల ముట్టడి' - 'ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు సీపీఎం కలెక్టరేట్ల ముట్టడి'
ఆర్టీసీ సమ్మెపై సానుకూలంగా స్పందిస్తే... ఇతర కార్పొరేషన్‌లోని కార్మికులు సమ్మె చేస్తారని ప్రభుత్వం సాకుగా చెబుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు.
cpm state secretary thammineni veerabhadram fairs on TRS Government