ముఖ్యమంత్రి కేసీఆర్.. సెక్యూలర్ ప్రతిపక్షం కాకుండా కమ్యూనల్ ప్రతిపక్షాన్ని కోరుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అందుకే అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా మజ్లిస్‌ను గుర్తించారని తెలిపారు.
కేసీఆర్.. తాను పన్నిన ఉచ్చులో తనే ఇరుకున్నాడు: నారాయణ
రాజకీయ తప్పులను సమీక్షించుకోకుండా.. ముఖ్యమంత్రిని మార్చడం సరైన పరిష్కారం కాదని తెరాస ప్రభుత్వానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితుల్లో భాజపా విసురుతున్న సవాళ్లు తెరాస ఎలా ఎదుర్కొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సెక్యూలరీ శక్తులను బలహీన పరిచి కమ్యూనల్ శక్తులను బలపర్చడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం.. అతని మెడకే ఉరితాడుగా మారిందని నారాయణ పేర్కొన్నారు. భాజపా విసురుతున్న సవాళ్లను తెరాస ఎలా ఎదుర్కొంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గులాబీ పార్టీ చేసిన రాజకీయ తప్పులను సమీక్షించుకోకుండా.. ముఖ్యమంత్రిని మార్చడం సరైన పరిష్కారం కాదని హితవు పలికారు.