తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టికల్​ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం'

మోదీ ప్రభుత్వ విధానాల వల్ల జమ్ము కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు లేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఆర్టికల్​ 370 రద్దు పూర్తి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. కశ్మీర్​లో కర్ఫ్యూ వాతావరణం నెలకొందని... ప్రజలు ఆసుపత్రులకు కూడా వెళ్లలేకపోతున్నారని వాపోయారు. దీనిని దేశ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.

డి రాజా

By

Published : Aug 25, 2019, 2:05 PM IST

ఆర్టికల్​ 370 రద్దు పూర్తి రాజ్యాంగ విరుద్ధమన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా. హైదరాబాద్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కామ్రేడ్​ ఇంద్రజిత్​ గుప్తా శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరైన ఆయన... మోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్​ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిందని పేర్కొన్నారు. కశ్మీర్​లో ఇంకా కర్ఫ్యూ వాతావరణమే కొనసాగుతోందని... ఇంటర్​నెట్​, టెలిఫోన్​లు పనిచేయడం లేదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నేతలు జమ్మూకశ్మీర్​కు వెళ్తే విమానాశ్రయంలోనే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఆర్టికల్​ 370 ప్రకారం కశ్మీర్​కు ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడేందుకు మోదీ సిద్ధంగా లేరని విమర్శించారు.

'ఆర్టికల్​ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం'

ABOUT THE AUTHOR

...view details