ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై ఎలాంటి విషాదాత్మక కథనాలను ప్రచారం చేయవద్దని... అలాంటి మాటలు ఎవరూ మాట్లాడవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ఇకనైనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలను మానుకోవాలని, ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.
'ఎస్పీ బాలు లాంటి గానకోకిలను కరోనా ఏం చేయలేదు' - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి గానకోకిలను కరోనా మహమ్మారి ఏం చేయలేదని... ఆయన త్వరలోనే కోలుకుని మల్లీ పాటలు పాడుతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆయనపై ఎలాంటి విషాదాత్మకమైన కథనాలను ప్రచారం చేయొద్దని సూచించారు.
'ఎస్పీ బాలు లాంటి గానకోకిలను కరోనా ఏం చేయలేదు'
ఎస్పీ బాలు లాంటి గానకోకిలను కరోనా వైరస్ ఏం చేయలేదని... ఆయన త్వరలోనే కోలుకుని మళ్లీ పాటలు పడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యంను చిన్నప్పటి నుంచి చూశానని... ఆయన చాలా ధైర్యవంతుడని తెలిపారు. ఆయన స్వభావం తనకు తెలుసునని... అందుకే ఆయన త్వరలో కోలుకుంటారని నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఆ ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదు : రేవంత్ రెడ్డి