వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో శానిటైజేషన్ చర్యలు తీసుకుంటున్నట్లు సికింద్రాబాద్ అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో రసాయనాల పిచికారీ
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు... ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటివద్ద రసాయనాలు పిచికారీ చేశారు.
కరోనా కట్టడికి.. రసాయనాల పిచికారి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా... పరిసరాలన్నీ శుభ్రపరిచేందుకు తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ అధికారి మోహన్రావు తెలిపారు. లాక్డౌన్ ప్రారంభం నుంచి ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఇదీ చదవండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!