రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 800 దాటింది. తాజాగా రాష్ట్రంలో 43 మందికి కరోనా సోకినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 809కి చేరింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 31 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. జోగులాంబ గద్వాల జిల్లాలో 7 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఇప్పటివరకు 186 మంది మహమ్మరి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా... 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 605 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో 800 దాటిన కరోనా కేసుల సంఖ్య.. - Corona cases increased in state
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. శనివారం మరో 43 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య 809కి చేరింది.
రాష్ట్రంలో 800 దాటిన కరోనా కేసుల సంఖ్య..