తెలంగాణ

telangana

ETV Bharat / state

ముషీరాబాద్​లో విస్తరిస్తోన్న కరోనా.. కొత్తగా 33 పాజిటివ్​ కేసులు

నగరంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు వైద్య సిబ్బంది విస్తృతంగా కరోనా రాపిడ్​ టెస్టులు చేస్తున్నారు. ఇవాళ కొత్తగా 33 పాజిటివ్​ కేసులు నమోదు కాగా వైరస్​ బారిన పడిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.

corona cases at musheerabad in hyderabad
ముషీరాబాద్​లో విస్తరిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 33 కేసులు

By

Published : Jul 11, 2020, 8:16 PM IST

ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది కరోనా రాపిడ్ పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ముషీరాబాద్​లో గత మూడు రోజుల నుంచి 65 మందికి టెస్టులు చేయగా వారిలో 20 మందికి వైరస్​ పాజిటివ్​ నిర్ధరణ అయ్యిందని డీబీఆర్ మిల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులు వెల్లడించారు.

కాగా రాంనగర్, ముషీరాబాద్, భోలక్​పూర్, అడిక్​మెట్, గాంధీనగర్, కవాడిగూడ డివిజన్లలోని అనేక ప్రాంతాల్లో వైద్య అధికారులు పరీక్షలు చేపడుతున్నారు. ఈ ఒక్కరోజులోనే నియోజకవర్గంలో మూడు కరోనా మరణాలు సంభవించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది.

వైద్య సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ నడుమ నియోజకవర్గంలోని మూడు కంటైన్మెంట్​​ జోన్ల పరిధిలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది రసాయన ద్రవాన్ని పిచికారీ చేస్తున్నారు. వైరస్ వ్యాపించిన నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గంలో 730 మంది కరోనా​ బారిన పడ్డారు. కాగా వీరిలో 532 మంది బాధితులు నగరంలోని వేర్వేరు ఆసుపత్రులతో పాటు ఇళ్లల్లోని ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

ABOUT THE AUTHOR

...view details