తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలకు భద్రత, భరోసా కల్పించేందుకే కార్డన్ సెర్చ్'

హైదరాబాద్ అంబర్ పేటలోని తురబ్ నగర్​లో ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ రమేశ్​ ఆధ్వర్యంలో 88 మంది పోలీసులతో నిర్భంద తనిఖీలు నిర్వహించారు. మలక్ పేట ఏసీపీ వెంకట రమణ నేతృత్వంలో చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజా భద్రత కోసమే నిర్బంద తనిఖీలు
ప్రజా భద్రత కోసమే నిర్బంద తనిఖీలు

By

Published : Feb 14, 2020, 6:37 AM IST

Updated : Feb 14, 2020, 7:10 AM IST

హైదరాబాద్ అంబర్ పేటలోని తురబ్ నగర్​లో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు భద్రత, భరోసాను కల్పించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహించామని మలక్ పేట ఏసీపీ వెంకటరమణ తెలిపారు. కాలనీ వాసులతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. మాక్స్ విజన్ అనే సంస్థ ద్వారా సీసీటీవీ ప్రాముఖ్యతను కాలనీవాసులకు చెప్పామని పేర్కొన్నారు.

భద్రతా కోసం అధునాతన టెక్నాలజీ వ్యవస్థ కలిగిన కాల్ డేటా ఆనలైజ్, డయల్ 100, హాక్ ఐ అప్లికేషన్ లాంటివని వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. నగర పోలీసులు చేపడుతున్న భద్రతాపరమైన చర్యలు, వాటి ప్రాముఖ్యతలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించామన్నారు.

ప్రజా భద్రత కోసమే నిర్బంద తనిఖీలు

ఇవీ చూడండి : పాలవ్యాపారి హత్య కేసులో ఐదుగురి అరెస్ట్​

Last Updated : Feb 14, 2020, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details