ప్రైవేటు డెయిరీలు లాభాలే లక్ష్యంగా ఉత్పత్తి చేస్తున్న కల్తీ పాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి అనిత సూచించారు. సికింద్రాబాద్‌లోని లాలాపేట్ విజయ డెయిరీలో కల్తీ పాలను గుర్తించే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పాలలో కల్తీపై అప్రమత్తంగా ఉండండి: అనిత - సదస్సులో పాల్గొన్న పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి అనిత
లాభాపేక్షే ధ్యేయంగా తయారవుతున్న కల్తీ పాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి అనిత తెలిపారు. సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లోని విజయ డెయిరీలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
కల్తీ పాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి : అనిత
వినియోగదారులకు రాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా కల్తీ పాలను ఏ విధంగా గుర్తించాలనే అంశంపై అవగాహన సదస్సును విజయ డెయిరీ ఎండీ నిర్వహించారు. ప్రైవేట్ డెయిరీల యాజమాన్యాలు లాభాల కోసం సోడా, వైట్ పెయింట్, గ్లూకోజ్ వంటి పదార్థాలను ఉపయోగించి పాలను తయారు చేస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అనిత పేర్కొన్నారు.