జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో రిటర్నింగ్ అధికారులు పక్షపాతం వహించడం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గాజులరామారం కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్ విషయంలో రిటర్నింగ్ అధికారి సుజాత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
కాంగ్రెస్ నామినేషన్లను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు: వీహెచ్ - గ్రేటర్ ఎన్నికలు
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. గాజులరామారంలో కూన శ్రీనివాస్‌గౌడ్ విషయంలో రిటర్నింగ్ అధికారి సుజాత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నామినేషన్లను తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు: వీహెచ్
వరద పరిహారం విషయంలో భాజపా, తెరాస... ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని వీహెచ్ విమర్శించారు. దుబ్బాక తరహాలో గ్రేటర్ ఎన్నికలను మార్చేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.