పీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠతకు తెరలేపింది. దిల్లీ కేంద్రంగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యనాయకులు... పదవిని ఆశిస్తున్న ఆశావహులు ఒక్కరొక్కరుగా దిల్లీ చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు దిల్లీలో ఉండగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు దిల్లీలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ప్రయత్నాలు...
అధిష్ఠానం పిలుపుమేరకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మధ్యాహ్నం దిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడే ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్‌గాంధీని కలిశారు. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసేందుకు కూడా ప్రయత్నించారు. డిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ భేటీలో పాల్గొనేందుకు ఎంపీ రేవంత్ రెడ్డి... ఇవాళ ఉదయం దిల్లీ బయలుదేరి వెళ్లారు.