తెలంగాణ

telangana

ETV Bharat / state

'కుట్రపూరితంగానే కొత్త మున్సిపల్​ చట్టాన్ని తెచ్చారు'

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మున్సిపల్‌ ఎన్నికలపై ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు గాంధీభవన్‌లో ఇవాళ సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు.

'కుట్రపూరితంగానే కొత్త మున్సిపల్​ చట్టాన్ని తెచ్చారు'

By

Published : Jul 22, 2019, 10:08 PM IST

మున్సిపల్​ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్వంలో గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. సెలక్ట్‌, ఎలక్ట్‌ పద్ధతి ద్వారా అఫిడవిట్‌ తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్న కమిటీ కన్వీనర్‌ పొన్నం ప్రభాకర్‌... ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాజకీయ కోణంలోనే కొత్త కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారని ఆరోపించారు. కుట్ర పూరితంగానే మున్సిపల్‌ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని ఏఐసీసీ కార్యదర్శులు సంతప్‌కుమార్‌, వంశీచంద్‌ రెడ్డి ఆరోపించారు. ఓటర్లు జాబితా తప్పుల తడకగా ఉందని, అసంబంద్ధంగా వార్డుల విభజన జరిగిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగానే 14 మున్సిపాలిటీలపై ఎన్నికలు జరగకుండా స్టే వచ్చిందన్నారు. తాము అన్ని విధాల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

'కుట్రపూరితంగానే కొత్త మున్సిపల్​ చట్టాన్ని తెచ్చారు'
ఇదీ చూడండి: 'పురపాలక ఎన్నికల్లో బీసీలు, ముస్లింలకు సగం సీట్లు'

ABOUT THE AUTHOR

...view details