కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు భాజపాకు కేంద్రంలో బేషరతు మద్దతు ఇస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆరోపించారు. భాజపా కబంధ హస్తాల్లో తెరాస ఎంపీలు బందీ అయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ఉన్న సీబీఐ, నయీం కేసు, కాళేశ్వరం అవినీతి, ఇంటర్ అవకతవకలపై కేంద్ర సర్కారు ఎందకు స్పందించడం లేదో లక్ష్మణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.
'రాష్ట్రంలో తెరాస, భాజపావి తెరచాటు రాజకీయాలు'
భాజపా, తెరాస పార్టీలపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు నపుంసక రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
'రాష్ట్రంలో తెరాస, భాజపా నపుంసక రాజకీయాలు చేస్తున్నాయి'