హుజూర్నగర్లో ప్రజాస్వామ్యం ఓడిపోయి అధికార తెరాస గెలిచిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వరుస ఓటములతో వచ్చిన సానుభూతి కూడా సైదిరెడ్డి గెలుపునకు దోహదం చేసిందన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని హుజూర్‌నగర్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని పొన్నం తెలిపారు. పురపాలక పోరులో పట్టణ ఓటర్లు విచక్షణతో వ్యవహరిస్తారన్నారు. మంత్రులు తలసాని, ఎర్రబెల్లి దయాకర్రావు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలను తెరపైకి తెచ్చినా... హర్యానా, మహారాష్ట్రలలో గట్టి పోటీ ఇచ్చామని పొన్నం తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో సగానికి పైగా... కాంగ్రెస్ కైవసం చేసుకుందని పొన్నం వెల్లడించారు.
'ప్రజాస్వామ్యం ఓడిపోయి... అధికార పార్టీ గెలిచింది'
హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచిందని ఆరోపించారు.
CONGRESS LEADER PONNAM PRABHAKAR ON HUZURNAGAR BY ELECTION RESULTS 2019