తెలంగాణ

telangana

ETV Bharat / state

క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్​

ఫిరాయింపులకు పాల్పడిన తమ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద నిరసనలతో పాటు రాజీనామాకు డిమాండ్‌ చేయాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. ఈ పోరాటానికి మిత్ర పక్షాలైన తెదేపా, సీపీఐ, తెలంగాణ జన సమితి నేతలను కలుపుకుని ముందుకు వెళ్లాలని హస్తం పార్టీ భావిస్తోంది.

భట్టి

By

Published : Jun 14, 2019, 5:45 AM IST

క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమైన కాంగ్రెస్​

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీకి గుడ్‌బై చెప్పి కారెక్కారు. పార్టీ ఫిరాయించిన వీరెవరూ.. ఎమ్మెల్యే పదవికి కాని.. కాంగ్రెస్‌ పార్టీకి కాని రాజీనామా చేయలేదు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పార్టీ వీడి తెరాసలో చేరినట్లు పేర్కొన్నారు. అవసరమైతే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తామని ప్రకటించారు. ఒక జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మరొక ప్రాంతీయ పార్టీకి చెందిన శాసన సభాపక్షంలో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్దమంటూ కాంగ్రెస్‌... ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేత భట్టి.. తెరాస వైఖరిని నిరసిస్తూ.. దీక్ష కూడా చేపట్టారు.

నిరసనలు..

ఓ వైపు న్యాయపోరాటం చేస్తునే.... మరో వైపు మేధావుల సదస్సు ఏర్పాటు చేసి విలీనం ఎంత వరకు సబబు అని చర్చ చేపట్టనున్నారు. రాజకీయ పార్టీలకు చెంది రాజ్యాంగంపై పట్టున్న కాంగ్రెస్‌ నేతలతోపాటు న్యాయవాదులు, జర్నలిస్టులు, ఇతర ప్రజాసంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఆందోళనలు చేపట్టి, వారి రాజీనామాను డిమాండ్​ చేయాలని నిర్ణయించారు. త్వరలో ఈ కార్యచరణను అమలు చేయాలని భావిస్తున్నట్లు భట్టి అన్నారు.

ఇవీ చూడండి: 'దొంగ' తెలివి: సీసీటీవీ వైర్లు కత్తిరించి ఏటీఎం చోరీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details