ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాంనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి లోకేశ్ యాదవ్ విన్నవించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లోని బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాంనగర్ తదితర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్ లకు వెళ్లి ప్రచారం చేశారు.
ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతా: లోకేశ్ యాదవ్ - జిహెచ్ఎంసీ పోల్స్ 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి లోకేశ్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన ఆయన... ప్రజలంతా హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.
ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతా: లోకేశ్ యాదవ్
ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడే పార్టీలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: మీరు గెలిపించండి... కొట్లాడైనా సమస్యలు పరిష్కరిస్తా: రేవంత్