Hyderaabad Metro : హైదరాబాద్ మెట్రో రైళ్లు మరింత వేగంతో దూసుకెళ్లనున్నాయి. మెట్రో రైళ్ల వేగ పరిమితి పెంపునకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సెఫ్టీ అనుమతిచ్చిందని మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఇప్పటి కంటే మరో 10 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతిచ్చిందని చెప్పారు. మార్చి 28, 29, 30 తేదీల్లో మెట్రో రైళ్ల వేగం భద్రతపై తనిఖీలు చేపట్టిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇకపై మరింత వేగంగా హైదరాబాద్ మెట్రో పరుగులు - హైదరాబాద్ తాజా వార్తలు
Hyderaabad Metro : హైదరాబాద్ మెట్రో రైళ్లు మరింత వేగంగా వెళ్లేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సెఫ్టీ అనుమతించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఇప్పుడున్న వేగం కంటే మరో 10 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి లభించిందన్నారు.
హైదరాబాద్ మెట్రో
మెట్రో రైళ్ల వేగ పరిమితి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల పెంపునకు అంగీకరించారు. తద్వారా ప్రయాణ సమయం మరింత ఆదా కానుంది. నాగోల్ -రాయదుర్గం మధ్య 6 నిమిషాల ప్రయాణ సమయం మిగలనుంది. మియపూర్ నుంచి ఎల్బీనగర్కు 4 నిమిషాలు.. జేబీఎస్ -ఎంజీబీఎస్ ఒకటిన్నర నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుందని మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:Super Saver Card Offer: 'అందుబాటులోకి మెట్రో ఆఫర్.. ఇకపై ఎన్నిసార్లైనా తిరగొచ్చు'