తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం తన నిర్ణయం మార్చుకొని రెవిన్యూ శాఖను బలోపేతం చేయాలి' - vra

హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్వో, వీఆర్ఏ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాల మేథావులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు.

'సీఎం తన నిర్ణయం మార్చుకొని రెవిన్యూ శాఖను బలోపేతం చేయాలి'

By

Published : Sep 15, 2019, 12:44 AM IST

రెవిన్యూశాఖలో ముఖ్య భూమిక పోషిస్తూ... 130 ఏళ్ల చరిత్ర కలిగిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ వీఆర్‌ఓ, వీఆర్‌ఏ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌ చిక్కడిపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాల మేథావులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మార్చుకొని రెవిన్యూశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమగ్ర భూ సర్వే ద్వారా రైతు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించి.... రెవిన్యూ రికార్డులను ఆధునికరించాలని డిమాండ్‌ చేశారు.

'సీఎం తన నిర్ణయం మార్చుకొని రెవిన్యూ శాఖను బలోపేతం చేయాలి'

ABOUT THE AUTHOR

...view details