తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

ఎంపీ సంతోష్​ కుమార్​ జన్మదినం సందర్భంగా గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ వృక్షవేదం అనే పుస్తకాన్ని రూపొందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని రూపొందించిన సంతోష్​కుమార్​ను సీఎం అభినందించారు.

CM kcr unveils the book published by Green India Challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

By

Published : Dec 8, 2020, 5:10 AM IST

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ సంపాదకత్వంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ రచించారు. ఈ పుస్తకంలో భారతీయ సాహిత్యంలోని శ్లోకాలు, తెలంగాణ అటవీ సౌందర్యంతో కూడిన ఫొటోలను జతచేసి ప్రచురించారు.

ఈ సందర్భంగా వృక్షవేదం పుస్తకాన్ని రూపొందించిన సంతోష్ కుమార్​ను ముఖ్యమంత్రి అభినందించారు. వృక్షాలను దైవంగా భావించే సంస్కృతి మనదన్న ముఖ్యమంత్రి... ప్రభుత్వ నిరంతర కృషితో హరిత తెలంగాణ కల సాకారమవుతోందని అన్నారు.

ఇదీ చదవండి :ఖమ్మంలో ఐటీహబ్​ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details