తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రంప్​తో దావత్​ కోసం నేడు దిల్లీకి సీఎం కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈరోజు ఉదయం దిల్లీకి వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ రాజ్​భవన్​లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

CM KCR tomorrow Delhi Tour latest news
CM KCR tomorrow Delhi Tour latest news

By

Published : Feb 24, 2020, 7:57 PM IST

Updated : Feb 25, 2020, 6:11 AM IST

సీఎం కేసీఆర్​ ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సాయంత్రం రాజ్​భవన్​లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యే విందుకు రాష్ట్రపతి భవన్... దేశంలోని ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. ఈ జాబితాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫిలిగ్రి చార్మినార్‌ ప్రతిమతో కూడిన జ్ఞాపికను, పోచంపల్లి శాలువాను సీఎం కేసీఆర్‌ అందజేయనున్నారని తెలిసింది. ట్రంప్‌ సతీమణి మెలనియా, కుమార్తె ఇవాంకాలకు పోచంపల్లి, గద్వాల పట్టుచీరలను బహూకరించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: '300 బిలియన్​ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం

Last Updated : Feb 25, 2020, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details