తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!

ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులో వేగం పెంచింది. ప్రయాణికులను చేరవేయడమే కాకుండా సరకు రవాణా చేసేలా ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జరిగే సరకు రవాణా ఇకపై కచ్చితంగా ఆర్టీసీ ద్వారానే జరుగుతుందని కేసీఆర్​ స్పష్టం చేశారు. రాష్ట్ర రవాణా సంస్థ - ఆర్టీసీపై ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

cm-kcr-review-on-rtc-cargo-service-in-hyderabad
ప్రభుత్వ శాఖల సరకు రవాణా అర్టీసీలోనే

By

Published : Dec 26, 2019, 5:27 AM IST

Updated : Dec 26, 2019, 7:09 AM IST

ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!

ఆర్టీసీని నష్టాల్లోంచి గట్టెకించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్​ ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రవాణా సంస్థ ఆర్టీసీపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్​ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఈడీలు హాజరయ్యారు.

బతుకమ్మ చీరలు, విద్యాసంస్థలకు పుస్తకాలు

ఆర్టీసీలో కార్గో, పార్సిల్ సేవలను విస్తృత పరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించినట్లే అన్ని చోట్లకూ సరకు రవాణా చేయాలన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరకు రవాణాను ఇకపై కచ్చితంగా ‘ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీస్’ ద్వారానే చేస్తామన్న కేసీఆర్... ఇందుకు సంబంధించి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. బతుకమ్మ చీరలు, విద్యాసంస్థలకు పుస్తకాలు, డిపోల నుంచి బ్రాండీ షాపులకు మద్యం, ఆసుపత్రులకు మందులు తదితర ప్రతి సరకు రవాణా ఇకపై ఆర్టీసీ ద్వారానే జరిగేట్లు చూస్తామని అన్నారు"

ఇతర రాష్ట్రాలకు సరకు రవాణా

సురక్షితమని పేరున్న ఆర్టీసీలో సరకు రవాణా విభాగాన్ని పటిష్ట పరిస్తే ప్రజలు తమ సరకులను ఆర్టీసీ ద్వారానే రవాణా చేస్తారని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఎక్కువగా నివసించే ముంబయి, బీవండి, సోలాపూర్, నాగపూర్, జగ్దల్​పూర్ తదితర ప్రాంతాలకు సరకు రవాణా చేయాలని చెప్పారు. సరకు ఎగుమతి, దిగుమతి కోసం హైదరాబాద్​తో పాటు ఇతర నగరాల్లో చాలా చోట్ల స్టాక్ పాయింట్లు పెట్టాలన్నారు.

202 మందితో బోర్డు ఏర్పాటు

సరకు రవాణా విషయంలో ఉద్యోగులకు తగిన శిక్షణ ఇవ్వాలని.. రవాణాకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్​.. బోర్డు కూర్పును ఖరారు చేశారు. ప్రతి డిపో నుంచి ఇద్దరేసి ఉద్యోగులతో మొత్తం 202 మంది సభ్యులుగా ఉంటారు. ఇందులో 94 మంది బీసీలు, 38 మంది ఎస్సీలు, 26 మంది ఎస్టీలు, 44 మంది ఓసీలు ఉంటారు. మొత్తం సభ్యుల్లో మహిళా ఉద్యోగులు 73 మంది ఉంటారు.

సీఎం సమీక్షలో ప్రధానాంశాలు

  1. బోర్డు సమావేశాలు డిపో పరిధిలో వారానికోసారి, రీజియన్ పరిధిలో నెలకోసారి, కార్పొరేషన్ పరిధిలో మూడు నెలలకోసారి జరుగుతుందని సీఎం తెలిపారు.
  2. ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను బోర్డు సమావేశాల్లో పరిష్కరించాలన్నారు.
  3. హైదరాబాద్​లోని వివిధ డిపోల నుంచి నేరుగా చెన్నై, నాగపూర్, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
  4. పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చే విషయంలో సరళమైన విధానం అనుసరించాలని సూచించారు.

ఇవీ చూడండి: 'విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయి'

Last Updated : Dec 26, 2019, 7:09 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details