CM KCR Comments on Piyush Goyal: ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ విషయంలోనే ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పీయూష్ గోయల్ కాదు... పీయూష్ గోల్‌మాల్ అంటూ విమర్శించారు. తెలంగాణ రైతులను ఉద్దేశించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని పీయూష్ గోయల్ చెప్పారని.. అసలు తాము గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా అంటూ మండిపడ్డారు.
తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? ఎవరితోనైనా గొడవ పడొచ్చు కానీ.. రైతులతో పడవద్దు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైనవి. పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు. మేము పీయూష్ గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా? పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్‌మాల్.
-- సీఎం కేసీఆర్