తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిస్‌, లండన్‌లో కరెంట్‌ పోవచ్చు కానీ.. హైదరాబాద్‌లో పోదు: సీఎం కేసీఆర్‌

CM KCR ON AIRPORT METRO : హైదరాబాద్‌ను పవర్‌ ఐ ల్యాండ్‌గా మార్చామని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌లో కరెంట్‌ పోవచ్చు కానీ.. హైదరాబాద్‌లో మాత్రం పోదని వ్యాఖ్యానించారు. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరమన్న ఆయన.. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు.

CM KCR
CM KCR

By

Published : Dec 9, 2022, 12:59 PM IST

CM KCR ON AIRPORT METRO : హైదరాబాద్‌ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవరసమని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. మైండ్‌స్పేస్‌ వద్ద ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు శంకుస్థాపన అనంతరం అప్పా కూడలిలోని పోలీస్‌ అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా దేశ రాజధాని దిల్లీ కంటే హైదరాబాద్‌ పెద్దదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. అద్భుతమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. చరిత్రలో సుప్రసిద్ధ నగరం భాగ్యనగరమన్న ఆయన.. 1912లోనే హైదరాబాద్‌కు విద్యుత్‌ వచ్చిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను పవర్‌ ఐ ల్యాండ్‌గా మార్చామన్నారు. న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌లో కరెంట్‌ పోవచ్చు కానీ హైదరాబాద్‌లో మాత్రం కరెంట్‌ పోదని అన్నారు. పరిశ్రమ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందన్న సీఎం కేసీఆర్‌.. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశ రాజధాని దిల్లీ కంటే హైదరాబాద్‌ పెద్దది. అద్భుతమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కాలుష్య రహితంగా మార్చడానికి మెట్రో చాలా అవసరం. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరం. - సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details