తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2021, 12:49 PM IST

ETV Bharat / state

'సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి'

సీఎం పుట్టినరోజును పురస్కరించుకుని తలపెట్టిన 'కోటి వృక్షార్చన'లో సినీ, రాజకీయ ప్రముఖులు చురుకుగా పాల్గొంటున్నారు. మండలి ఛైర్మన్​ గుత్తా, సభాపతి పోచారం అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

cm kcr birthday celebrations at assembly
'సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి'

వాతావరణ సమతుల్యతను కాపాడటానికి.. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డిలు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి.. ప్రజలకు సేవలందించాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు సంతోశ్​కుమార్ తలపెట్టిన కోటి వృక్షార్చనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే విరివిగా మొక్కలు నాటాలని సభాపతి సూచించారు. తద్వారా ఎలాంటి ప్రకృతి విపత్తులు తలెత్తకుండా ఉంటాయన్నారు.

ఇదీ చూడండి: కేసీఆర్​కు అరుదైన బహుమతి.. జోరుగా 'కోటి వృక్షార్చన'

ABOUT THE AUTHOR

...view details