తెలంగాణ

telangana

ETV Bharat / state

నేను దిగి.. కేటీఆర్​ను ఎందుకు సీఎం చేస్తా..!

"చాలా మంది మిత్రులున్నారు నాకు. 20 ఏళ్ల నుంచి చెప్తున్నరు నా ఆరోగ్యం గురించి. కేసీఆర్ ఆరోగ్యం ఖతం అయిందంటగదా. అమెరికా పోతండంటగదా. ఇపుడు నేను సచ్చిపోవట్టి 20 ఏళ్లు అవుతోంది అధ్యక్షా!" - తన ఆరోగ్యంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్

అసెంబ్లీలో సీఎం కేసీఆర్

By

Published : Sep 15, 2019, 4:51 PM IST

Updated : Sep 15, 2019, 6:35 PM IST

తన ఆరోగ్యంపై పలువురు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి... మరో మూడు దఫాలు రాష్ట్రంలో తెరాస ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తన వయసు ఇప్పుడు 66 ఏళ్లు అని... ఇంకో పదేళ్లు తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను దిగిపోయి కేటీఆర్​ను ఎందుకు సీఎంను చేస్తానని అన్నారు. ప్రజల దీవెన... దేవుడి దయతో బాగుంటానని వెల్లడించారు. తమ తప్పులు ఉంటే చెప్పండి సవరించుకుంటామన్నారు. రాష్ట్ర పరువును బజారున పెట్టొద్దని తెలిపారు.

తన ఆరోగ్యంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్
Last Updated : Sep 15, 2019, 6:35 PM IST

ABOUT THE AUTHOR

...view details