ఏపీలో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా చిన్నారి అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు రఫీని ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి, ఫొటోలు తీస్తూ... తన వెంట నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. చిన్నారిపై అత్యాచారం చేసి... ఆపై హతమార్చి కల్యాణ మండపం వెనుక వదిలి వెళ్లినట్లు తేలింది. సీసీ ఫుటేజీ సహా... ఊహా చిత్రాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది..?
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాల్యానికి చెందిన చిన్నారి... తల్లిదండ్రులతో కలిసి ఈనెల 7న చేనేతనగర్‌లోని కల్యాణ మండపంలో జరిగిన పెళ్లికి హాజరైంది. అప్పటి వరకు కల్యాణ మండపంలో సరదాగా ఆడుకున్న చిన్నారి... ఉన్నట్లుండి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఆందోళనకు గురై... చుట్టుపక్కల గాలించారు. మరుసటి రోజు మండపం వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలిసి... అంతా షాకయ్యారు.
నిందితుడి గతమంతా ఇంతే..!