తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ ఎన్నికల ఫలితాలు వైకాపా పతనానికి నాంది: చంద్రబాబు

వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని అక్రమాలు చేసినా.. ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. తొలి దశ ఎన్నికల్లో తెదేపాకు 38.74 శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చాయని వెల్లడించారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

chandrababu-fires-on-ycp-over-ap-panchayat-elections-results
ఎన్నికల ఫలితాలు వైకాపా పతనానికి నాంది: చంద్రబాబు

By

Published : Feb 10, 2021, 2:16 PM IST

ఎన్నికల ఫలితాలు వైకాపా పతనానికి నాంది: చంద్రబాబు

ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైకాపా పతనానికి నాంది అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పారు. 20 నెలల వైకాపా పాలనలో అన్నీ ఉల్లంఘనలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారన్న ఆయన.. అమరావతి, పోలవరం పెట్టుబడులను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో హింసాకాండ, పెద్దఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఎంత హింస పెట్టినా.. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారని కార్యకర్తల కృషిని కొనియాడారు.

ఎన్నికల్లో 38.74 శాతం ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. 94 శాతం గెలుచుకుందంటూ వైకాపా నేతలు గాలికబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉందన్న చంద్రబాబు... అరాచకాలు చేసేవారు ఫలితాలను చూసైనా మారాలని హితవు పలికారు. పార్టీ పెడుతున్నామని షర్మిల చెబుతుంటే... ఏ2 మాత్రం లేదంటారా? అని అన్నారు.

అచ్చెన్నాయుడిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా అక్రమ కేసు బనాయించారు. వైకాపా ఎమ్మెల్యేలు మాట్లాడితే మాత్రం పట్టించుకోరు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. ఎస్‌ఈసీ చెబితే వినొద్దని మంత్రి పెద్దిరెడ్డి చెబుతారా? అఖిల భారత సర్వీసు అధికారులను బెదిరించడమేంటి..? ఏ తప్పూ చేయని కొల్లు రవీంద్రపై కేసు పెడాతారా..?

-చంద్రబాబు, తెదేపా అధినేత

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలపై ఏకపక్షంగా 174 అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు తెలిపారు. వైకాపా నేతలే దౌర్జన్యాలు చూస్తూ... తెదేపా శ్రేణులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదన్న చంద్రబాబు... ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:మీడియాతో మాట్లాడేందుకు ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి

ABOUT THE AUTHOR

...view details