తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర బృందం భేటీ

హైదరాబాద్‌లో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో బృందం సమావేశమైంది.

central team met with state police
పోలీసు ఉన్నతాధికారులతో కేంద్రం బృందం భేటీ

By

Published : Apr 26, 2020, 10:58 AM IST

హైదరాబాద్​లోని డీజీపీ కార్యాలయంలో కేంద్ర బృందానికి డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. కేంద్ర బృందం... డీజీపీ, ముగ్గురు సీపీలు, ఏడీజీలు, ఐజీలతో సమావేశమయ్యారు. అనంతరం కంటైన్మెంట్ జోన్లు, అమీర్‌పేట్‌లోని ప్రకృతి వైద్యశాలను పరిశీలిస్తారు. మ.3 గంటలకు మెహదీపట్నం రైతుబజార్, రాత్రి బస కేంద్రాలను సందర్శిస్తారు.

హైదరాబాద్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. నిన్న గచ్చిబౌలిలోని కొవిడ్(టిమ్స్) ఆస్పత్రిని సందర్శించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనం చేస్తోంది.

ఇదీ చూడండి:ఐదు దశల్లో లాక్​డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే..

ABOUT THE AUTHOR

...view details