తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కరోనా బాధితుల వైద్య చికిత్స సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీసింది.

ఎర్రగ‌డ్డంలోని ఈఎస్ఐ ఆసుప‌త్రిని  సందర్శించిన కేంద్ర బృందం
ఎర్రగ‌డ్డంలోని ఈఎస్ఐ ఆసుప‌త్రిని సందర్శించిన కేంద్ర బృందం

By

Published : May 2, 2020, 7:13 PM IST

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని బృందం ఎర్రగ‌డ్డలోని ఈఎస్ఐ ఆసుప‌త్రిని సంద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా ఆసుపత్రి డీన్ డా.శ్రీ‌నివాస్‌, సూప‌రింటెండెంట్ డా.పాల్‌, ఇత‌ర వైద్యాధికారుల‌తో క‌లిసి ఆసుప‌త్రిలో వైద్య సేవలు వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. కరోనా పాజిటివ్ కేసుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు చేసిన ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఇంత వ‌ర‌కు కరోనా పాజిటివ్ కేసులు ఈ ఆసుప‌త్రికి రాలేద‌ని డీన్ కేంద్ర బృందానికి వివ‌రించారు. అనంత‌రం చ‌ర్లప‌ల్లిలోని ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గోదామును కేంద్ర బృందం ప‌రిశీలించింది. బియ్యం నిల్వల గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details