తెలంగాణ

telangana

ETV Bharat / state

'బ్యాక్టీరియా  పెరుగుదలను అడ్డుకోవచ్చు' - NEW INVENTION

యాంటి బయోటిక్స్​ని తట్టుకునేందుకు బ్యాక్టీరియా తమని తాము మార్చుకుంటుంది. వాటి పెరుగుదలను ఆపేందుకు ఉపయోగపడే సరికొత్త ఆవిష్కరణను కనుగొన్నారు సీసీఎంబీకి చెందిన శాస్త్రజ్ఞులు.

'బ్యాక్టీరియా  పెరుగుదలను అడ్డుకోవచ్చు'

By

Published : Apr 2, 2019, 7:58 PM IST

'బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకోవచ్చు'
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) వారు సరికొత్త ఆవిష్కరణను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రస్తుత కాలంలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు పెరుగుతున్నాయి. యాంటి బయోటిక్స్​కి తట్టుకునేలా తమని తాము మార్చుకుంటున్నాయని తరచూ వింటున్నాం.

బ్యాక్టీరియా ఎదుగుదలకు కారణమవుతున్న ఎంజైమ్​లను సీసీఎంబీ కనుగొన్నది. సుమారు పదేళ్ల పాటు ఈకోలి బ్యాక్టీరియా మీద పరిశోధనలు చేసిన సీసీఎంబీ ఇటీవల బ్యాక్టీరియాలోని ఎండో పెప్టిన్సే బ్యాక్టీరియా ఎదుగుదలకు కారణమని తెలిపింది. వాటిని అడ్డుకోగలిగితే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నియంత్రించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కే మిశ్రా తెలిపారు. డాక్టర్ మంజులా రెడ్డి ఆధ్వర్యంలో పవన్ అనే పరిశోధకుడు దీనిని ఆవిష్కరించడం విశేషం. ఈ పరిశోధన అమెరికాకు చెందిన ఓ ప్రముఖ జర్నల్​కి సైతం ఎంపిక కావటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details