హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద మద్యం మత్తులో ఓ వ్యక్తి వేగంగా దూసుకు వచ్చి రోడ్డుపై విభాగినిని ఢీకొట్టాడు. హిమాయత్ నగర్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆ వ్యక్తి కారులో మద్యం బాటిల్ లభించింది. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలవగా... ఆస్పత్రికి తరలించారు. అతను ప్రయాణించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అర్ధరాత్రి డివైడర్ను ఢీకొట్టిన కారు - అతివేగం కారు ప్రమాదం
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన ఓ వ్యక్తి రోడ్డుపై డివైడర్ను ఢీకొన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద జరిగింది.
Car Accident