హైదరాబాద్ కోఠిలో ఓ కాంట్రాక్టర్ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. కాంట్రాక్టు డబ్బుల విషయమై రామంతపూర్‌కు చెందిన కాంట్రాక్టర్ రాజిరెడ్డి అతని స్నేహితుడు నరేందర్‌తో కలిసి సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలోని ఇసామియా బజార్లో సాయంత్రం 5:30 గంటలకు ఐదుగురు వ్యక్తులను కలిసేందుకు వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్న తరువాత ఐదుగురు దుండగులు రాజిరెడ్డిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు.
హైదరాబాద్ నడిబొడ్డున వ్యాపారి కిడ్నాప్
హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పరిధి కోఠి చౌరస్తాలో ఓ వ్యాపారి అపహరణకు గురయ్యాడు. కారులో రాజిరెడ్డి అనే వ్యాపారిని బలవంతంగా ఐదుగురు దుండగులు ఎత్తుకెళ్లారు. కాంట్రాక్టు డబ్బు విషయంలో అపహరణ జరిగినట్లు సుల్తాన్‌బజార్ సీఐ తెలిపారు.
హైదరాబాద్ నడిబొడ్డున వ్యాపారి కిడ్నాప్
అతని స్నేహితుడు నరేందర్ డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని... సీసీ కెమెరాల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కాంట్రాక్టు డబ్బు ఇవ్వకపోవడంతోనే మాట్లాడేందుకు కారులో తీసుకెళ్లినట్లు విచారణలో దుండగులు వెల్లడించినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: సమాజంలో నేర ప్రవృత్తి ఆపేందుకు పాఠ్యాంశాలు
Last Updated : Jan 3, 2020, 7:52 AM IST