ETV Bharat / city

సమాజంలో నేర ప్రవృత్తి ఆపేందుకు పాఠ్యాంశాలు - kcr book releasing hj dora

సమాజానికి మంచి జరుగుతుందన్నపుడు కొన్ని కఠినమైన పనులు చేయక తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకపోయినా ప్రజల మనోభావాలు గుర్తించి, గౌరవించి చేయాలని వ్యాఖ్యానించారు. సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించేలా విద్యావిధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. మంచి సమాజం నిర్మించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే బోధనలు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.

సమాజంలో నేర ప్రవృత్తి ఆపేందుకు పాఠ్యాంశాలు
సమాజంలో నేర ప్రవృత్తి ఆపేందుకు పాఠ్యాంశాలు
author img

By

Published : Jan 2, 2020, 10:16 PM IST

సమాజంలో నేర ప్రవృత్తి ఆపేందుకు పాఠ్యాంశాలు

విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ హెచ్ జే దొర ఆత్మకథ పుస్తకం '‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్'’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్​లో ఆవిష్కరించారు. హెచ్ జే దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా పుస్తకాన్ని రాశారని ముఖ్యమంత్రి అభినందించారు. పోలీస్ సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి నిష్ణాతులను చేయాలని... వారిలో ప్రొఫెషనలిజం పెరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం డీజీపీని కోరారు. డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణే కాకుండా సామాజిక బాధ్యతతో గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, బియ్యం అక్రమ రవాణా అరికట్టడం, హరితహారం ద్వారా చెట్లు పెంచడంలో ఎంతో కృషి చేశారని కితాబునిచ్చారు. ఇదే తరహాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో కూడా పోలీసులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.

ఆర్​.ఎస్​ ప్రవీణ్​ కుమార్ సంకల్పానికి సంపూర్ణ మద్దతు: సీఎం

రాష్ట్రంలో దళితులను విద్యావంతులను చేసేందుకు ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో కష్టపడుతున్నారన్న సీఎం కేసీఆర్... న్యూనతాభావాన్ని తీసేసి గొప్ప పాఠశాలల్లో చదువుతున్నామన్న భావన కల్పిస్తున్నారని ప్రశంసించారు. వారిని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలన్న సంకల్పానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.

విద్యాబోధనలో విలువల పాఠ్యాంశాలు: సీఎం

దురదృష్టవశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోందని... కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసం విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన ద్వారా నైతిక విలువలు పెంపొందించవచ్చని అభిప్రాయపడ్డారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. పాఠ్యాంశాలను తయారుచేసేందుకు మాజీ డీజీపీలతో కమిటీ వేస్తామని జీయర్ స్వామి లాంటి ఆధ్యాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటామని తెలిపారు.

మంచి కోసం కఠినత్వం తప్పదు: సీఎం

మంచిని కాపాడేందుకు కఠినంగా వ్యవహరించడం తప్పుకాదని... కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా అని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా, ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి చేయాల్సి వస్తుందని అన్నారు. అలా చేయడం తప్పు కాదని వ్యాఖ్యానించారు.

ఇవి తెలంగాణకు గొప్ప సంపదగా మిగులుతాయి: హెచ్​జే దొర

సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో ప్రజోపయోగ పనులు జరుగుతున్నాయని మాజీ డీజీపీ హెచ్ జే దొర ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గురుకులాలు, ప్రజావైద్యం మెరుగుదల, చెరువుల పునరుద్ధరణ పనులు తెలంగాణకు గొప్ప సంపదగా మిగులుతాయని అభిప్రాయపడ్డారు.

శాంతియుత పంథా వల్లే ఇదంతా: పీఎస్ రామ్మోహన్​

కేసీఆర్ శాంతియుత పంథా వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారన్న మాజీ డీజీపీ రొద్దం ప్రభాకర్ రావు... దేశంలో తెలంగాణ పోలీసులు అందుకున్న అవార్డులు ఎవరూ అందుకోలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర పోలీసులు అద్భుత విజయాలు సాధించారని సీబీఐ మాజీ డైరెక్టర్ జనరల్ విజయ రామారావు తెలిపారు.

File : TG_Hyd_78_02_Dora_Bookrelease_Pkg_3053262 From : Raghu Vardhan Note : Feed from Whatsapp ( ) సమాజానికి మంచి జరుగుతుందన్నపుడు కొన్ని కఠినమైన పనులు చేయకతప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకపోయినా ప్రజల మనోభావాలు గుర్తించి, గౌరవించి చేయాలని వ్యాఖ్యానించారు. సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించేలా విద్యావిధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. మంచి సమాజం నిర్మించే క్రమంలో జీయర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందించి వచ్చే విద్యా సంవత్సరం నుంచే బోధనలు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు...లుక్ వాయిస్ ఓవర్ - 01 విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ హెచ్ జే దొర తన ఆటోబయోగ్రఫీగా రాసిన ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. హెచ్ జే దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ ఇతర పోలీసు అధికారులకు స్పూర్తినిచ్చేలా పుస్తకాన్ని రాశారని ముఖ్యమంత్రి అభినందించారు. హెచ్ జే దొర తన అనుభవాన్నంతా రంగరించి మంచి పుస్తకం రాశారన్న కేసీఆర్... టీంవర్క్ తో విజయాలు, క్లిష్ట సమయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడం, నేరాలు అదుపు చేసే పద్ధతులు, వనరుల సమర్థ నిర్వహణ తదితరాలను నేర్పారని చెప్పారు. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా మారుతూ కార్యాలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. పోలీస్ సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి నిష్ణాతులను చేయాలని... వారిలో ప్రొఫెషనలిజం పెరిగేలా డీజీపీ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో డీజీపీ మహేందర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు సామాజిక రుగ్మతలు తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. కేవలం శాంతి భద్రతల పర్యవేక్షణే కాకుండా సామాజిక బాధ్యతతో గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, బియ్యం అక్రమ రవాణా అరికట్టడం, హరితహారం ద్వారా చెట్లు పెంచడంలో ఎంతో కృషి చేశారని కితాబునిచ్చారు. ఇదే తరహాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడంలో కూడా పోలీసులు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఈ ఏడాది చిత్తశుద్ధితో చేపడుతుందన్న సీఎం... అందులో పోలీసులు భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బైట్ - కె.చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి వాయిస్ ఓవర్ - 02 రాష్ట్రంలో దళితులను విద్యావంతులను చేసేందుకు ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతో కష్టపడుతున్నారన్న సీఎం కేసీఆర్... న్యూనతాభావాన్ని తీసేసి గొప్ప పాఠశాలల్లో చదువుతున్నామన్న భావన కల్పిస్తున్నారని తెలిపారు. వారిని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలన్న సంకల్పానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్న ఆయన... అలాంటి వాళ్లను ప్రోత్సహించాలని అన్నారు. దురదృష్ట వశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోందని... కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందన్న ఆయన... విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన ద్వారా నైతిక విలువలు పెంపొందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్న ముఖ్యమంత్రి... వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పాఠ్యాంశాలను తయారు చేయాలని అన్నారు. మాజీ డీజీపీలతో కమిటీ వేస్తామని... జీయర్ స్వామి లాంటి ఆధ్మాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలిని కేసీఆర్ కోరారు. మంచిని కాపాడేందుకు కఠినంగా వ్యవహరించడం తప్పుకాదని... కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా అని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా, ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి చేయాల్సి వస్తుందని అన్నారు. అలా చేయడం తప్పు కాదని వ్యాఖ్యానించారు. సమాజానికి మంచి జరుగుతుంటే కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదని స్పష్టం చేశారు. బైట్ - కె.చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి ఎండ్ వాయిస్ ఓవర్ - సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో ప్రజోపయోగ పనులు జరుగుతున్నాయని మాజీ డీజీపీ హెచ్ జే దొర ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గురుకులాలు, ప్రజావైద్యం మెరుగుదల, చెరువుల పునరుద్ధరణ పనులు తెలంగాణకు గొప్ప సంపదగా మిగులుతాయని అభిప్రాయపడ్డారు. మానవ వనరుల సమర్థ వినియోగంతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా మారుతుందనే నమ్మకం ఉందని దొర అన్నారు. కేసీఆర్ శాంతియుత పంథా వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారన్న మాజీ డీజీపీ రొద్దం ప్రభాకర్ రావు... దేశంలో తెలంగాణ పోలీసులు అందుకున్న అవార్డులు ఎవరూ అందుకోలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర పోలీసులు అద్భుత విజయాలు సాధించారని సీబీఐ మాజీ డైరెక్టర్ జనరల్ విజయరామారావు తెలిపారు. పూర్వ అధికారుల నుంచి నేర్చుకోవడం ద్వారా ప్రస్తుత అధికారులు పెనుమార్పులు తెచ్చేందుకు సాధ్యమవుతుందన్న డీజీపీ మహేందర్ రెడ్డి... రాష్ట్ర పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకుడిగా నిలవడం వల్లే ఎన్నో మంచి ఫలితాలు సాధించామని చెప్పారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.