తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ జిల్లాల్లో 'వాల్మీకి' సినిమాకు బ్రేక్..!!

ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వాల్మీకి సినిమా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతిభద్రతల దృష్ట్యా సినిమా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ల ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా పేరు మార్చాలని కొన్నాళ్లుగా వాల్మీకి సంఘాల ఆందోళనలు చేస్తున్నాయి.

ఆ జిల్లాల్లో 'వాల్మీకి' సినిమాకు బ్రేక్..!!

By

Published : Sep 19, 2019, 10:27 PM IST

ఆ జిల్లాల్లో 'వాల్మీకి' సినిమాకు బ్రేక్..!!

ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా నిలిపివేయాలంటూ... ఆయా జిల్లాల పాలనాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం వాల్మీకి కుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కేంద్ర మంత్రి జావడేకర్​కు ఫిర్యాదు చేశారు. సినిమా టైటిల్​తో పాటు వరుణ్​తేజ్ వాల్మీకి పేరుతో గన్నులు పట్టుకుని ఉండటంపై ఆ సంఘం నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా సినిమాను నిలుపుదల చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా విడుదలైనా... కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మాత్రం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details