హైదరాబాద్ మీర్ పేట్ ఠాణా పరిధిలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఏడు సంవత్సరాల బాబును 14 ఏళ్ల బాలుడు కిడ్నాప్‌కు స్కెచ్ వేశాడు. కిడ్నాపర్ పదో తరగతి చదువుతున్న మైనర్ కావడం గమనార్హం. డబ్బులిస్తాం రమ్మని పిలిచి పోలీసులు పట్టుకున్నారు. డబ్బులు కోసం నాటకం ఆడి మూడు గంటల పాటు తల్లి దండ్రులు, కాలనీ వాసులు, పోలీసులకు చెమటలు పట్టించాడు. కిడ్నాప్ చేసిన ఇంటి పరిసరాల్లోనే ఉంటూ హైడ్రామా సృష్టించాడు. ఏం చేయాలో తెలియక తల్లి దండ్రులు ఆందోళన పడ్డారు. అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించాడు.
మాటలు కలిపి... అల్మాస్గూడ తీసుకెళ్లి...
మీర్ పేట్ పరిధిలోని టీఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్న రాజు ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కొడుకు ఏడేళ్ల అర్జున్ బడంగ్ పేట్ మౌంట్ కార్మెట్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా అతనితో మాటలు కలిపి మీర్ పేట్ నుంచి అల్మాస్గూడ వరకు తీసుకెళ్లాడు కిడ్నాపర్... అక్కడి నుంచి తండ్రి రాజుకు ఫోన్ చేసి 'మీ కొడుకుని కిడ్నాప్ చేశా'మంటూ బెదిరించాడు. విడుదల చేయాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాలుడి తండ్రి స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయగా... నిందితుడి కాల్ డేటా వివరాలను పరిశీలించిన పోలీసులు అల్మాస్గూడకి చెందిన వెంకటేష్ పేరుతో అడ్రస్ ఉందని గుర్తించారు. సోదా కోసం అక్కడ ఇంటికి వెళ్తే ఎవ్వరూ లేరు. అప్పుడే నిందితుడి నుంచి మారోమారు పోన్ వచ్చింది.