హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని ఇంద్రానగర్‌లో బాంబు ఉందన్న వార్తలు కలకలం రేపాయి. ఓ హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి వదిలివెళ్లిన బాక్సును చూసి అనుమానించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఆ డబ్బాలో బల్బులు మాత్రమే ఉన్నాయని తెల్చారు. ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలకు వివరించి బాక్సును స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలిలో బల్బుల కలకలం
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధి ఇంద్రానగర్‌లో బాంబు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి వదిలివెళ్లిన బాక్సును చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు తనిఖీలు చేపట్టారు.
గచ్చిబౌలిలో బాంబు కలకలం